జిల్లాలో ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి
Vsp: తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ పిలిప్ బ్రౌన్ 227వ జయంతిని పురస్కరించుకుని, విశాఖలో ఏయూలో తెలుగు శాఖలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎ. నరసింహరావు, తెలుగు శాఖాధిపతి జర్రా అప్పారావు సీపీ బ్రౌన్ చిత్రపటాన్ని అలంకరించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.