నేడు ఒంగోలు రానున్న వందేమాతరం శ్రీనివాస్

ప్రకాశం: అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని 22వ తేదీ ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్ళగుంట కృష్ణయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు వందేమాతరం. శ్రీనివాస్‌కు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు -2025ను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు.