మున్సిపల్ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం: సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు శనివారం పకడ్బందీ భద్రతా సమీక్ష నిర్వహించారు. జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలలో ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు, అక్రమ మద్యం, ఓటర్లపై ప్రలోభాలు, భయభ్రాంతి నివారణకు పూర్తి ఏర్పాట్లు చేశారు.