ప్రశాంతంగా ప్రారంభమైన టెన్త్ క్లాస్ పరీక్షలు
ATP: గుత్తిలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ఇవాళ ప్రారంభం అయ్యాయి. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యా శాఖ అధికారులు సూచించడంతో సకాలంలో విద్యార్దులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్దులను వారి తల్లి తండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు వెంట వచ్చి పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చారు. పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.