ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

NLR: ఉలవపాడు మండలం, కే. రాజుపాలెం జంక్షన్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కరేడు పంచాయతి టెంకాయ చెట్లపాలెం గ్రామం నుంచి కూలీలతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.