నల్లబర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభం

BPL: గత రెండు నెలలుగా నల్లబర్లీ పొగాకు రైతులు చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కృషి ఫలించింది. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొబ్బరికాయ కొట్టి నల్లబర్లీ పొగాకు తొలి కొనుగోలును శనివారం మార్క్ ఫెడ్ ఎండీ కరుణశ్రీ ప్రారంభించారు.