ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
TPT: కేవీబీపురం మండలం కాళంగి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరిపాక వాసుదేవరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితుల కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు.