ఘోర రోడ్డు ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

సూర్యాపేట పట్టణ శివారులో జాతీయ రహదారిపై బాలెంల గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2 లారీలు ఢీకొన్నాయి. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ, వాహనదారులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.