కంచిలో బల్లుల తాపడాలు మార్చలేదు: ఈఓ

కంచిలో బల్లుల తాపడాలు మార్చలేదు: ఈఓ

కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రస్తుతం ఉన్న పురాతన బంగారు, వెండి బల్లుల తాపడాలు మార్చలేదని ఆలయ ఈఓ రాజ్యలక్ష్మి వెల్లడించారు. బంగారు తాపడంలోని ప్రతిమలు అద్యశ్యమయ్యాయని వివాదం రాజుకున్న వేళ బంగారు, వెండి బల్లులు ఉండే స్థలాన్ని పోలీసులకు చూపించినట్లు ఈఓ తెలిపారు. బంగారు బల్లి అని అందరూ అంటున్నా అది వాస్తవానికి పూత అని ఇత్తడితో తయారు చేసిందని చెప్పారు.