నేడు జిల్లాకు రానున్న హోం శాఖా మంత్రి

నేడు జిల్లాకు రానున్న హోం శాఖా మంత్రి

VZM: జిల్లా ఇన్‌ఛార్జ్, హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత గురువారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 11 గంటలకు ప్రారంభం కానున్న జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని కలెక్టర్‌ అంబేడ్కర్‌ బుధవారం ఒక ప్రకటన తెలిపారు.