పోలీస్ క్రీడల్లో మహేశ్‌కు గోల్డ్ మెడల్
AKP: దేవరాపల్లి మండలానికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రెడ్డి మహేశ్ కుమార్ అనకాపల్లి జిల్లా పోలీస్ వార్షిక క్రీడల్లో ప్రతిభ కనబర్చారు. విశాఖపట్నం కైలాసగిరి సమీప ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్‌లో రెండు బంగారు పథకాలు సాధించారు. కబడ్డీలో కాంస్య పథకం సాధించినట్లు పేర్కొన్నారు.