'పంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలు బంద్'

NDL: ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంసం విక్రయాలు నిషేధిస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా కబేళాలు, మాంసం దుకాణాలు, నాన్ వెజ్ హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే 1965 పురపాలక చట్టం ప్రకారం దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని బేతంచెర్ల కమిషనర్ హరి ప్రసాద్ హెచ్చరించారు.