గాలివీడులో పార్క్‌కు భూమిపూజ
అన్నమయ్య: గాలివీడు-గోరాంచెరువు సరిహద్దులోని పెద్ద చెరువు వద్ద రూ.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న పబ్లిక్ పార్క్‌కు డా. మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. చెరువు మొరవ నుంచి పార్క్ వరకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి రాయచోటి రోడ్డుకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్ నిర్మాణంతో మండల ప్రజలకు విశ్రాంతి, వ్యాయామ సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.