అనారోగ్యంతో బాలిక మృతి, గ్రామస్తుల్లో ఆందోళన

KRNL: ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద గ్రామంలో అదివారం 13 ఏళ్ల రూప అనే బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఉపాధ్యాయ దంపతుల కుమార్తె. ఇదే రోజు గ్రామంలో నలుగురు మరణించగా, వారం రోజుల్లో 20 మంది మరణించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై వైద్యులు, అధికారులు స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.