ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
BDK: పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంగళరావు నగర్ కాలనీకి చెందిన గుర్రం దుర్గారావు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎదురుగా వచ్చిన లారీ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.