రోడ్డుపక్కన వీవీప్యాట్ స్లిప్పుల కలకలం
బీహార్ సమస్తీపూర్ జిల్లాలో రోడ్డు పక్కన పెద్ద మొత్తంలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనమివ్వటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. సహాయ రిటర్నింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేయటంతో పాటు కేసు నమోదు చేసింది. అయితే ఈ వీవీప్యాట్ స్లిప్పులు మాక్ పోల్‌కు సంబంధించినవని వెల్లడించింది. ఈ చర్య వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రత ఎక్కడ దెబ్బతినలేదని తెలిపింది.