VIDEO: రక్షించబడిన చిన్నారులను గుర్తించండి.. పోలీసుల విజ్ఞప్తి

VIDEO: రక్షించబడిన చిన్నారులను గుర్తించండి.. పోలీసుల విజ్ఞప్తి

HNK: కాజీపేట రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసి పలువురు చిన్నారులను రక్షించారు. కొందరిని తల్లిదండ్రులకు అప్పగించగా, ఫోటోలో ఉన్న మరో ముగ్గురు చిన్నారులు శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్నారు. చిన్నారులను ఎవరైనా గుర్తిస్తే కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి (8712685122) ను సంప్రదించాలని గురువారం కోరారు.