విషాదం.. వృద్ధుడు సజీవదహనం
NTR: రెడ్డిగూడెం(మం) శ్రీరాంపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బటిపాటి జమలయ్య(65) అనే వృద్ధుడు సజీవదహనమయ్యాడు. ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరిగుడిసెకు మంటలు చెలరేగి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. పదేళ్ల క్రితం భార్య మరణించగా, పిల్లలకు వివాహాలై దూరంగా ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.