ఈనెల 5న అన్నవరం స్వామివారి గిరిప్రదక్షిణ

ఈనెల 5న అన్నవరం స్వామివారి గిరిప్రదక్షిణ

E.G: ఈనెల 5న అన్నవరం సత్యనారాయణ స్వామివారి గిరిప్రదక్షిణ జరగనుంది. కార్తీక మాసంలో ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కొండ చుట్టూ సుమారు 35 కిలోమీటర్ల దూరం ఈ ప్రదక్షిణ జరుగుతుంది. ఆలయ అధికారులు ప్రదక్షిణ మార్గంలో తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచనున్నారు. కార్తీక మాసం పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.