పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
నిజామాబాద్: కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఇంఛార్జీలు షబానా బేగం, మాధవి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్‌ను హెచ్ఎం సాయిలు ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులు దాదాపు 50 రకాల వంటలను తయారు చేసుకోని వచ్చారు. అధికారులు ఉపాధ్యాయులు వివిధరకాల వంటకాలను రుచిచూసి విద్యార్థులను అభినందించారు.