VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న జంపలేరు

ప్రకాశం: అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామ సమీపంలోని జంపలేరు వాగులో జలకల సంతరించుకుంది. గత కొద్దిరోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జంపలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. వస్తున్న వరద నీటిని చూసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ జంపలేరు వాగుకు వరద నీరు వచ్చినట్లుగా స్థానిక ప్రజలు చెబుతున్నారు.