రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్సై హెచ్చరిక
JN: రఘునాథపల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. గోవర్ధనగిరి-అశ్వరావుపల్లి మార్గంలో అనుమతులు లేకుండా మట్టి రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. డ్రైవర్లు,యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కోన్నారు. కలెక్టర్ అనుమతి లేకుండా మట్టి, ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.