'సెల్వ కుమార్‌పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి'

అన్నమయ్య: పుల్లంపేటలోని దళవాయి పల్లె దళితవాడకు చెందిన సెల్వ కుమార్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని అంబేద్కర్ దళిత ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పుల్లంపేటలో సెల్వకుమార్ ఇంటిని పరిశీలించిన అనంతరం శనివారం ఆయన మాట్లాడారు. కారు, ఇంటిని ధ్వంసం చేశారని వాటికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.