మాచర్లలో కలెక్టర్, ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటన
PLD: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ కృత్తికా శుక్లా బుధవారం మాచర్లలో సుడిగాలి పర్యటన చేశారు. మాచర్లలోని కస్తూర్బా గాంధీ, మేకలమండి, దేవలమ్మ చెరువులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. అభివృద్ధి పనులు, ఏర్పాట్లపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.