వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట ఆందోళన

MBNR: ఇంజక్షన్ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం జాఫర్ పల్లికి చెందిన నర్సింహ్మరెడ్డి మూత్రనాళాల్లో సమస్య కారణంగా సోమవారం MBNRలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరాడు. శస్త్ర చికిత్స అనంతరం బుధవారం వైద్యులు ఇంజక్షన్ ఇవ్వడంతో నర్సింహ్మరెడ్డి అప్పటికప్పుడే మృతి చెందినట్లు తెలిపారు.