సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తు
కృష్ణా: ఏపీ సంక్షేమ శాఖ వేనుకబడిన తరగతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని తలపెట్టనుంది. సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డిసెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ అధికారి జీ. రమేష్ తెలిపారు. 7న స్క్రీనింగ్ టెస్ట్ ఉండుందన్నారు. మరిన్ని వివరాలకు మచిలీపట్నం, గుడివాడ వేనుకబడిన తరగతుల సంక్షేమాధికారి కార్యలయాలను సంప్రదించాలని తెలిపారు.