బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: SP

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: SP

ADB: బాధితుల ఫిర్యాదులను, సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లాలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రతను కలిగి ఉంచాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.