స్కాలర్‌షిప్‌కు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు

స్కాలర్‌షిప్‌కు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు

ELR: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో ముగ్గురు విద్యార్థులు NMMS స్కాలర్షిప్‌కు ఎంపికైనట్లు హెచ్ఎం కోనేరు శ్రీదేవి తెలిపారు. పాఠశాలలో యనుమల కార్తీక్, నెర్సు హేమంత్ యాదవ్, బాణావత్ ప్రవల్లిక అనే విద్యార్థులు స్కాలర్షిప్‌కు ఎంపికైనట్లు చెప్పారు. వీరికి ఏడాదికి రూ. 12వేల చొప్పున నాలుగేళ్లు ఆర్థిక సాయం అందుతుందన్నారు.