పుంగనూరులో శివరూపిణిగా మారెమ్మ దర్శనం
చిత్తూరు: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీవిరుపాక్షి మారెమ్మ శివరూపిణిగా సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే అమ్మవారి మూల విగ్రహాన్ని అర్చకులు పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, విభూది, అడ్డ నామాలతో అలంకరించారు. భక్తులు మారెమ్మను దర్శించి పూజలు నిర్వహించారు.