వార్డు సభలో పాల్గొన్న కార్పొరేటర్
WGL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వార్డు సభలో 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్నారు.