మినీ వ్యాన్‌లో రూ. 3.80 లక్షలు పట్టివేత

మినీ వ్యాన్‌లో రూ. 3.80 లక్షలు పట్టివేత

KMR: బాన్సువాడ మండలం జీకే తండా వద్ద అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.3.80 లక్షలను పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అధికారులు ఒక మినీ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా రూ.3.80 లక్షలు లభ్యమయ్యాయి. ఇటుకల డబ్బులు ఇందల్వాయి గ్రామానికి తీసుకుని వెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని రసీదు ఇచ్చామని అధికారులు తెలిపారు.