గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఈడీ నోటీసులు

TG: గొర్రెల పంపిణీ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మొయినుద్దీన్ అండ్ గ్యాంగ్ దాదాపు రూ.2కోట్లు మేర మోసం చేసినట్టు ఈడీ దృష్టికి వచ్చింది.