సెప్టెంబరు 3 నుంచి పవిత్రోత్సవాలు

TPT: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 3 నుంచి 5వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు ముందు రోజు సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్విక్వారణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్రసమర్పణ చేస్తారు. అనంతరం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వహిస్తారు.