'శిశు మరణాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోండి '
NDL: జిల్లాలో మాతృ మరియు శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. ఇవాళ నంద్యాల కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాతృ - శిశు మరణాల నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గర్భిణీ, ప్రతి శిశువు భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.