చెరువు కట్ట తెగి, పంట పొలాల్లోకి నీరు

NRPT: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలంలోని కొల్పూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. దీంతో చెరువులోని నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఈ సంఘటనతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.