రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన సదస్సు
SRPT: హుజూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సీఐ చరమంద రాజు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీఐ సూచించారు. ఈ సదస్సులో ఎస్సై మోహన్ బాబు, ఎంపీడీవో లావణ్య, ఆర్ & బీ అధికారులు పాల్గొన్నారు.