నిండు గర్భిణికి తప్పని డోలీమోత

ASR: కొయ్యూరు మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన కొర్రా శిరీష అనే గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు డోలీమోతతో సుమారు మూడు కిలోమీటర్ల దూరం మోసుకొని వేమనపాలెం వరకూ తీసుకొచ్చారు. అక్కడ నుంచి అంబులెన్సులో వై. రామవరం సీహెచ్సీకి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.