'గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి'
E.G: అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో కూటమి ప్రభుత్వంలో చేసిన పలు సిసి రోడ్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 97 లక్షలు కేటాయించిందని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామాలలో మౌలిక వసతులు కల్పిస్తుందని వెల్లడించారు.