విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
NTR; విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు చివరి రోజుకు చేరాయి. దీక్ష విరమించేందుకు పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఎర్రటి దుస్తుల్లో భవానీలతో కొండ ప్రాంతం కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని దీక్ష విరమిస్తున్నారు.