చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
టీమిండియాతో రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా అరుదైన రికార్డును సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై సౌతాఫ్రికా గెలవడం ఇది 13వ సారి. దీంతో T20Iల్లో టీమిండియాపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. గతంలో 12 విజయాలతో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పేరిట సంయుక్తంగా ఉండేది.