సైబర్ మోసం: సగం ధరకే ఇస్తామని.. సర్దేశారు..!

సైబర్ మోసం: సగం ధరకే ఇస్తామని.. సర్దేశారు..!

ADB: ఆదిలాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. క్రాంతి నగర్‌కు చెందిన క్రేన్ డ్రైవర్ సతీష్‌ను L&T కంపెనీ ఉద్యోగినని చెప్పి, సగం ధరకే డీజిల్ ఇస్తామని నమ్మించారు. ఇది నమ్మిన సతీష్‌ విడతలవారీగా రూ.1.37 లక్షలు చెల్లించాడు. అనంతరం డీజిల్ ఇవ్వకుండా మోసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు.