మంత్రిని కలిసిన గౌడ సంఘం నాయకులు

మంత్రిని కలిసిన గౌడ సంఘం నాయకులు

SRD: సంగారెడ్డి జిల్లా గౌడ సంఘం నాయకులు మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలోని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. ఈనెల 18వ తేదీన జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్, నాయకులు రాములు గౌడ్, హనుమంతు గౌడ్, వినయ్ గౌడ్ పాల్గొన్నారు.