పెళ్లి తర్వాత సమంత పేరు మార్పు?
హీరోయిన్ సమంత తాజా నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె తన ప్రస్తుత పేరు 'సమంత రూత్ ప్రభు'లోని ఇంటిపేరును తొలగించి, ఇకపై కేవలం 'సమంత' అనే పేరుతోనే కొనసాగాలనుకుంటున్నట్లు సమాచారం. గతంలో కూడా అక్కినేని ఇంటిపేరును తొలగించిన సమంత, ఇప్పుడు తన వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా చూపించేందుకు ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది.