పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన ఎస్పీ
GNTR: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని, సిబ్బంది నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని, శాఖాపరమైన కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సిబ్బంది నిజాయితీతో సేవ చేయాలని సూచించారు.