సీఎంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే
ATP: జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు. తన వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.