విజయవాడలో కంటి పరీక్షలు
NTR: విజయవాడ స్టెల్లా కాలేజ్ విద్యార్థులకు, సిబ్బందికి కంటి పరీక్షలు మంగళవారం నిర్వహించారు. అయాన్ హాస్పిటల్ డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. కంటి పరీక్షల్లో అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు, మందులు సరఫరా చేస్తామని, అలాగే, పిల్లల్లో ప్రాధమికంగా విటమిన్ ఎ లోపం, మెల్ల కన్ను, పుట్టుకతో వచ్చిన కంటి సమస్యలు వంటివి ఈ పరీక్షల్లో నిర్ధారిస్తామన్నారు.