జూద స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్టు

జూద స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్టు

BPT: బాపట్ల రైలుపేట సమీపంలో జూదం ఆడుతున్న తొమ్మిది మందిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,10,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు, సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112కి కాల్ చేయాలని ప్రజలను కోరారు.