మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా నివాళి
ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో బుధవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో రాణించిన ఇందిరాగాంధీ భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు.