దుమ్ముతో కష్టాలు పడుతున్న ప్రజలు

దుమ్ముతో కష్టాలు పడుతున్న ప్రజలు

CTR: పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు తవ్వి కంకర వేసి నెలలుగా వదిలేయడంతో దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరుతుందని స్థానిక మహిళలు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే సీఎం చంద్రబాబు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.