బ్రిడ్జిపై నుంచి పడిపోయిన వృద్ధురాలు

బ్రిడ్జిపై నుంచి పడిపోయిన వృద్ధురాలు

KRNL: ఆదోని పాత ఓవర్‌ బ్రిడ్జిపై నుంచి కళ్లు తిరిగి పడిపోవడంతో శాంతమ్మ (70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పరిలో ఉన్న కూతురు వద్దకు వెళ్లి వస్తుండగా, ఈ సంఘటన జరిగిందని కుమారుడు తెలిపారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.